పీవీ భూ సంస్కరణలు భేష్
పేదల కోసం భూ సంస్కరణలు తీసుకువచ్చి, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సదా చిరస్మరణీయుడని మంత్రి పొన్నం ప్రభాకర్ శ్లాఘించారు. ఆయన బహు భాషా కోవిదుడు, అత్యున్నతమైన రాజకీయవేత్తన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19 వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం లోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు నిర్మించే రహదారికి పీవీ పేరు పెడతామని మంత్రి ప్రకటించారు.
Discussion about this post