ఓటీటీలో 300 మిలియన్ల వాచ్ మినిట్స్
‘ది కేరళ స్టోరీ’. సినీ, రాజకీయ రంగాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల నడుమ గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. పలుచోట్ట నిషేధించినా సక్సెస్ కావడంలో ఎక్కడా తగ్గలేదు. ఫిబ్రవరి 16న ‘జీ5’ వేదికగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. 300 మిలియన్ల వాచ్ మినిట్స్ మైలు రాయిని కూడా దాటేసినట్లు చెబుతూ జీ5 పోస్టర్ విడుదల చేసింది.
థియేటర్లో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అంచనాలకు మించిన వ్యూస్ సాధిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది యువతులు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది.
Discussion about this post