పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇల్లు ముట్టడి
ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలను, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీలకు, తూటాలకు ఉద్యమాలు ఆగవు అంటూ నినాదాలు చేశారు. మా కష్టాలు మీకు తెలియడం లేదా…? ఏసీల్లో మీరు, ఎండల్లో మేమా ..?అంటూ నిలదీశారు. మంత్రి అప్పలరాజు బయటకు వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. మంత్రి ఇంట్లోకి వెళ్ళడానికి వారు యత్నించడంతో పోలీసులు వారిని నెట్టివేశారు.
Discussion about this post