సముద్రంలోని ఓడలపై దాడులకు పాల్పడిన హౌతీలు ప్రస్తుతం సముద్రంలోని కమ్యూనికేషన్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. తాజాగా భారత్-బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగింటిపై దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. వీటిల్లో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎర్ర సముద్రంలో నౌకల రక్షణకు అమెరికా సంకీర్ణసేనలు సిద్ధమైన వేళ.. బాబ్-ఎల్-మండెప్ వద్ద నుంచి వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హూతీలు హెచ్చరించారు. ఈ మేరకు వారు టెలిగ్రామ్‌లో సందేశాలు ఉంచారు. కొన్ని అండర్‌సీ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు అంతరాయం కలిగించడమే వారి లక్ష్యంగా తెలుస్తోంది.
Discussion about this post