సత్య సాయి జిల్లా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అభిమానులు, తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ధర్మవరం టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటించాలంటూ అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. టీడీపీ ఇంచార్జ్‌గా నేతలను, కార్యకర్తలను కాపాడుకున్న పరిటాల శ్రీరామ్‌కు టికెట్ కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటూ నినాదాలు చేశారు. ధర్మవరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో శ్రీరామ్‌కు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు గారు ధర్మవరంలో టిడిపిని రక్షించండి అని నినాదాలు చేశారు. పార్టీ ద్రోహికి,పార్టీకి నష్టం చేసిన వారికి టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఐదేళ్లుగా వైసిపితో,సూరితో పోరాటం చేశామని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మేము సహకరించేది లేదని స్పష్టం చేశారు.
Discussion about this post