సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. హత్నూర్ మండలం చందాపూర్ శివారులోని ఎస్‌బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారికి నిమ్స్, కేర్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతోపాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు తెలుస్తోంది. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేపట్టి కొనసాగిస్తున్నట్టు తెలిసింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Discussion about this post