జంటనగరాల్లో మత్తుమందులు అమ్ముతున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి భారీగా మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. 2009లో బిజినెస్ వీసా మీద భారతదేశానికి వచ్చిన నైజీరియన్ స్టాన్లీ… ఆ తర్వాత మత్తుమందుల వ్యాపారంలో అడుగుపెట్టాడు..గోవా నుంచి మత్తుమందులు తీసుకుని వచ్చి నగరంలో కస్టమర్లకు అమ్ముతున్న క్రమంలో అతడ్ని పట్టుకున్నామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
Discussion about this post