దేశంలో సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి వచ్చింది. గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేసి… ఆ తర్వాత విశాఖలో ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మనుషుల్ని సప్లై చేసేవాడు. కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. అక్కడికి వెళ్లిన యువతీ యువకులకు చైనా ఏజెన్సీ సభ్యులు ఆన్లైన్ జాబ్ ఆఫర్, ఫెడ్ఎక్స్ కొరియర్ స్కామ్‌లు ఏ విధంగా చేయాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన యువకులకు ప్రత్యేక టార్గెట్లు ఇచ్చి సైబర్ నేరాలు చేయించేవారని, ఎవరైనా చేయనంటే చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసేవారని సైబర్ మాఫియా చెప్పినట్టు నడుచుకుంటేనే భోజనం. ఒకవేళ అనుకున్న టార్గెట్ పూర్తి చేయకపోయినా భోజనం పెట్టకుండా చీకటిలో బంధించి చిత్రహింసలకు గురిచేసేవారని విశాఖకు చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో భాదితులను కాంబోడియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కృషిచేసిన విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యానార్.
Discussion about this post