హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిన్నరగా సమ్మె చేయడంతో ఆ చట్టాలను తొలగిస్తామని రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ దిగివచ్చారు. ఇప్పటికీ చట్టాలు తొలగించకపోవడంతో రైతులు మరోసారి ఢిల్లీలో ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుసంఘం నాయకులు ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగారు. అయితే అప్పటికే బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి వచ్చారు. గతంలో 3 చట్టాలు తెచ్చినా స్పందించని బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలో గులాబీ జెండాలతో వచ్చిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి మండిపడ్డారు. .
Discussion about this post