హైదరాబాద్ మహా నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రద్దీగా ఉన్న పలు మార్గాల్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. రాజధానిలో దాదాపు 12 వేల కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. అయితే, రహదారులు మరీ ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. 30 నిమిషాల గమ్య స్థానానికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతోంది.
రోడ్ల విస్తరణకు భారీ భవనాలు అడ్డుగా ఉండటంతో ఇక అండర్ గ్రౌండ్ టన్నెళ్ల నిర్మాణమే సరైన నిర్ణయమని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు ఐటీసీ కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రామ్ గూడ మీదుగా విప్రో సర్కిల్ వరకూ 9.5 కి.మీ మేర భారీ టన్నెల్‌ను నిర్మించబోతున్నారు. ఇక ఐటీసీ కోహినూర్ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ వరకూ 8 కి.మీ మేర టన్నెల్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Discussion about this post