ఉప్పల్ నల్లచెరువులో కబ్జాకి గురైన పలు ప్రాంతాలను కాపాడాలని కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను రంగనాథ్ ఆదేశించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
Discussion about this post