ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ నోట విన్న రంగనాథ్ పేరే వినిపిస్తుంది. ముఖ్యంగా ఆయన పేరు చెబితే భూబకాసరుల గుండెళ్లో గుబులు పడుతోంది. హైడ్రా ఏర్పాటైన తర్వాత బాధ్యతలు తీసుకున్న రంగనాథ్ తన పని తాను చేసుకుంటూ పోతూ సంచలనంగా మారారు.
మిషన్ ఇంపాసిబుల్ ను పాసిబుల్ చేసి నిరూపించే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తిని అధికారిగా ఎంచుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ తాననుకున్న కార్యాన్ని గట్టెక్కించడంలో సఫలం చెందుతోంది. అందుకే రాజధాని నగరంలో చెరువులు, నాలాలను కబ్జాల నుంచి కాపాడే బాధ్యతను 1996 గ్రూప్ 1 లో టాప్ ర్యాంకు అధికారి అయిన ఆవుల వెంకట రంగనాథ్ నియమించింది. రంగనాథ్ కొత్తగూడెం, మార్కపురంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు అందుకున్నారు.
కొత్తగూడెం, నల్గొండ, విజయవాడ జిల్లాల్లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆవుల వెంకట్ రంగనాథ్ అనేక కేసులను ఛేదించి పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేశారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. అయేషా మీరా కేసులోనూ, ఖమ్మంలో భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అప్పట్లో గంజాయి స్మగ్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమీషన్ రంగనాథ్ ను హైదరాబాద్ బదీలీ చేయగా రేవంత్ సర్కార్ రాష్ట్రంలో కొలువు దీరిన తరువాత ఆయన్ను GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ మరియు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. తరువాత రంగనాథ్ కు హైడ్రా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుండి భూబకాసరుల గుండెల్లో నిద్రపోతూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారాయన.
Discussion about this post