ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానని ఆల్ ఇండియా జ్యోతి భాపూలే బీసీ అసోసియేషన్ అధ్యక్షులు పోతల ప్రసాద్ నాయుడు అన్నారు. నర్సీపట్నంలోని కృష్ణ ప్యాలెస్ లో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నానని, ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాత… అనకాపల్లి జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్ ముఖ్యమంత్రి కావాలనే ధ్యేయంతో పనిచేశానని తెలిపారు.
Discussion about this post