నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసంద్రం మధ్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. ప్రజల మీద పెత్తనం చేసేందుకు తాను రాజకీయాలలోకి రాలేదన్నారు ప్రశాంతి రెడ్డి. సేవ చేసుకునేందుకు తాను ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. మీ ఇంటి ఆడపడుచుగా, మీ బిడ్డగా, యువకులకు యువతకి అమ్మగా వచ్చిన తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు.
Discussion about this post