భక్త రామదాసు విగ్రహం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా నిలిచిన భక్త రామదాసు పురాతన విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. 30 ఏళ్లుగా స్టేషన్ బయట ఉన్న విగ్రహాన్ని దేవుడి ప్రతిమగా భావించి పూజలు చేస్తున్నారు. స్టేషన్ లో ఉన్న విగ్రహాన్ని ఫొటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపడంతో నేలకొండపల్లికి వచ్చి పలు పరిశోధనలు చేసి భక్త రామదాసు విగ్రహంగా గుర్తించారు.
Discussion about this post