మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి మీడియా సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతర కవరేజ్ నిమిత్తం పాత్రికేయులకు కంప్యూటర్లు, ప్రింటర్ లు, స్కానర్లతోపాటు వైఫై సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. వారికి అల్పాహారం, భోజనాల సదుపాయం కల్పించామని తెలిపారు. పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క ప్రారంభించారు.
Discussion about this post