గత కొన్ని రోజులుగా చల్లటి వాతావరణంతో ఉపశమనం పొందిన రాష్ట్ర ప్రజలను పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతతో జనం ఇక్కట్లకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వారాల్లో సుమారు 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పగలు రాత్రి ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీలు వాడటం ప్రారంభించారు. పగటిపూట 3,100 మెగావాట్ల వరకు డిమాండ్ ఉంటే రాత్రి 9 గంటలకు 2, 697 మేర నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రాత్రి పూట 2,287 మెగావాట్లే నమోదయ్యింది.






















Discussion about this post