సిగరెట్ లో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి హానికరం. ఇదే హెచ్చరికను సిగరెట్ పెట్టెమీద కూడా ప్రభుత్వం ప్రింటు చేస్తుంది. సిగరెట్లకు అలవాటు పడి, నికోటిన్ వల్ల ఏటా అనేక మంది అకాల మృత్యు వాత పడుతున్నారు. ఈ వ్యసనం నుంచి విముక్తి కలిగేందుకు ఇ- సిగరెట్లను తయారు చేశారు. ఇది సురక్షిత మైన ఎంపిక అని మార్కెట్లు యువతను ఆకర్షించాయి. ఇది కూడా సిగరెట్ ఆకృతిలోనే ఉండి సిగరెట్ ను కాల్చిన అనుభూతినే ఇస్తుంది. ఇ- సిగరెట్ లోని పొగాకును తలపించేందుకు దాదాపు 2 వేల రకాల రసాయినాలుంటాయి.
పెన్నులాగా ఉండే ఎలక్ట్రిక్ పరికరాన్నే ఇ-సిగరెట్ అంటారు. దీన్ని 4 గంటలు ఛార్జింగ్ పెడితే గంట సేపు పనిచేస్తుంది. ఇందులో పొగాకు ఉపయోగించరు. నికోటిన్ తదితర రసాయనాలతో తయారు చేసిన ద్రవాన్ని ఇందులో నింపుతారు. దీన్నే వాప్ ఆయిల్ అంటారు. ఇవి రకరకాల ఫేవర్ రుచి- వాసనలలో లభిస్తాయి. ఒక్క ఇ- సిగరెట్లో ఉండే నికోటిన్.. 20 సిగరెట్లలో ఉండే నికోటిన్‌తో సమానం. భారత్ లో అక్రమంగా 460 ఇ-సిగరెట్ బ్రాండ్లు.. 7,700 ఫ్లేవర్స్‌లో లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖలో 25 వేల టన్నుల మాదకద్రవ్యాలతోపాటు ఇ- సిగరెట్లు కూడా కలకలం రేపాయి.
ఎలక్ట్రానిక్ సిగరెట్ లేదా వాప్ అనేది పొగాకు ధూమపానాన్ని అనుకరించే పరికరం. ఇది అటామైజర్, బ్యాటరీ వంటి పవర్ సోర్స్, ద్రవంతో నిండిన కార్ట్రిడ్జ్ లేదా ట్యాంక్ వంటి కంటైనర్‌ను కలిగి ఉంటుంది. పొగకు బదులుగా, వినియోగదారు ఆవిరిని పీల్చుకుంటాడు. అలాగే, ఇ-సిగరెట్‌ను ఉపయోగించడాన్ని “వాపింగ్” అని పిలుస్తారు. సాధారణ సిగరెట్లలో ఉండే నికోటిన్ పదార్ధాలు ఈ-సిగరెట్లలో చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ సిగరెట్ తయారీకి వాడిన రసాయనాల్లో ఆరు హానికరమైన పదార్థాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా స్టిమ్యులేటెడ్ కెఫీన్ ఉన్నట్టు తెలిసింది. ఇ-సిగరెట్ల వల్ల ఊపిరితిత్తుల్లో వేప్ ఆయిల్ చేరి గడ్డ కడుతున్నాయి. దీనివల్ల ఊపిరి అందక బాధితులు చనిపోతున్నారు.స్మోకింగ్ కంటే కూడా ఇ-సిగరెట్స్ మరింత డేంజర్. ఈ ముప్పును దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం భారత్ ఇ-సిగరెట్స్‌పై నిషేధం విధించింది.
వాపింగ్ లో హానికరమైన రసాయినాలతోపాటు నీటి ఆవిరి కూడా ఉంటుంది. దీనిని పీల్చడం వల్ల అది డైరెక్టుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. వాపింగ్ వ్యసనానికి దారి తీస్తుంది. ఊపిరితిత్తులు, గుండెకు ప్రమాదకారిగా మారుతుంది. నికోటిన్ వల్ల మూడ్స్ స్వింగ్ అవడం, నాడీ వ్యవస్థ మందగించడం జరుగుతుంది. దీంతో మెదడు పనితీరు మొద్దుబారుతుంది. ఇ-సిగరెట్ల వల్ల ఊపిరితిత్తుల్లో వాప్ ఆయిల్ చేరి గడ్డ కడుతున్నాయి. దీనివల్ల ఊపిరి అందక బాధితులు చనిపోతున్నారు.
ఇ- సిగరెట్లు దానిని పోలినవి దగ్గర ఉంచుకోవడం ఎలక్ట్రానిక్ సిగరెట్ యాక్టు పీఈసీఏ 2019 ప్రకారం కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. అంతేకాకుండా, ఇ- సిగరెట్ ను ఉత్పత్తి చేయడం, తయారు, దిగుమతి, ఎగుమతి, అమ్మకం, పంపిణీ, స్టోరేజ్, ప్రకటనలను ఇవ్వడంపై భారత ప్రభుత్వం నిషేధం ఇచ్చింది. దీనిని అతిక్రమించిన వారిపై అపరాధరుసుం తోపాటు జైలు శిక్ష విధిస్తారు.
Discussion about this post