చైనా భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. దీంతో భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇదిలా ఉంటే, సిక్కిం నుంచి కేవలం 150 కి.మీ దూరంలో చైనా తన అత్యాధునిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లలను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. టిబెట్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాట్సేలోని ఎయిర్‌పోర్టులో ఆరు J-20 ఫైటర్ జెట్లను మోహరించింది.
షిగాట్సే ఎయిర్‌పోర్టు మిలిటరీ, సివిలియన్ రెండు విధాలుగా పనిచేసేలా నిర్మించారు. ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటి. ఈ ఫైటర్ జెట్లతో పాటు J-500 ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా చిత్రాల్లో కనిపించింది. అయితే, భారత వైమానికదళం ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా అత్యంత అధునాతనమైన ఆపరేషనల్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రాంతంలో ఉన్నాయని సమాచారం. అయితే వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారని ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. భారత్ ప్రస్తుతం 36 ఫ్రెంచ్- నిర్మిత రాఫెల్ యుద్ధవిమానాలతో J-20ని ఎదుర్కొంటుంది. వీటిలో 8 ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ తో అధునాతన వైమానిక పోరాట వ్యాయామాల కోసం అలాస్కాకు వెళ్లాయి.
చైనా షిగాట్సే ఎయిర్ పోర్టు పశ్చిమ బెంగాల్‌లోని హసియార ఎయిర్ బేస్ నుంచి 290 కి.మీ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారత్ 16 రాఫెల్స్తో కూడిన రెండు స్వ్కాడ్రన్లను మోహరించి ఉంచింది. టిబెట్‌లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020 మరియు 2023 మధ్య చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్‌లోని జిన్జియాంగ్లో జెట్లను గమనించారు. చెంగ్డు J-20, మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు, ఇది 2017లో సర్వీస్‌లోకి వచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్. అయితే, చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉంచవచ్చని, వీటిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. స్టెల్త్ ఫైటర్ జెట్లను కార్యాచరణ కోసం రంగంలోకి దింపిన మూడో దేశంగా చైనా ఉంది. దీని ప్రధాన ప్రాముఖ్యత ”ఎయిన్ సుపీరియారిటీ”. ఇది చైనా అత్యంత అధునాతన ఎయిర్-టూ-ఎయిర్ క్షిపణుల్ని కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం PL-15 దీర్ఘ-శ్రేణి ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి కూడా ఉంది, వీటికి 300 కి.మీ పరిధిలోని వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు. గత ఐదేళ్లుగా భారత సరిహద్దు వెంబడి చైనా తన వాయుశక్తిని పెంచుతోంది. భారత్ కూడా సరిహద్దుల్లో సైనిక మోహరింపు జరుపుతోంది.
Discussion about this post