మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చగా చర్చగా మారింది. జర్మనీ, అమెరికా వంటి దేశాలు కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. ఆయా దేశాల రాయబారులకు భారత్ సమన్లు జారీ చేసింది. అయినా కూడా అమెరికా అదే స్థాయిలో రియాక్ట్ అయింది.
దేశంలో ఎన్నికలక హడావిడి మొదలైంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. మరోవైపు కీలక నేతల అరెస్టులు, ఇంకోవైపు ఎన్నికల బాండ్ల దుమారం, వీటి మధ్యలో కాంగ్రెస్ ఖాతాల ఫ్రీజింగ్ ఇలా అనేక అంశాలు ప్రజల్లో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఇవే అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఇష్యూలు గల్లీ నుంచి ఢిల్లీ వరకే కాదు.. అమెరికా వరకు వెళ్లింది. ప్రపంచస్థాయి దేశాల్లో దీనిపై తీవ్రంగా డిస్కషన్ నడుస్తోంది. ఇటివల ఈ అంశాలపై అమెరికా చేసిన కామెంట్స్.. ఆ వెంటనే కేంద్రం రియాక్షన్ ఇవన్నీ చూస్తుంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో తెలుస్తోంది.
ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు పెను సంచలనంగా మారింది. ఎన్నికల టైంలో ఇలాంటి స్టెప్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకే ఇంతగా ప్రపంచ స్థాయిలో దీనిపై చర్చ నడుస్తోంది. చివరకు అమెరికా కూడా స్పందించే స్థాయికి వెళ్లిపోయింది. అమెరికా తీరుపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ US తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా ఉన్న గ్లోరియా బెర్బెనాకు సమన్లు జారీ చేసింది. ఆమెను పిలిచిన భారత్ విదేశాంగ శాఖ జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది.
అయితే దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి మాథ్యూమిల్లర్ను మీడియా ప్రశ్నిస్తే ఆయన కూడా అదే తీరున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సహా మిగతా పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నామని, ప్రతిక్షమైన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయాడాన్ని కూడా ఖండించారు. ఇది ఎన్నికల పై ప్రభావం చూపే ఆవకాశం ఉందని మాథ్యూమిల్లర్ పెర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది.
అమెరికా, జర్మనీ స్పందనపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఆయా దౌత్యవేత్తలకు భారత్ నోటీసులు జారీ చేసింది. యూఎస్ రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాను పిలిచి ఈ విషయంపై మాట్లాడింది. భారత్ సౌర్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ప్రజాస్వామ్య దేశాల విషయంలో బాధ్యతతో వ్యవహారించాలని గట్టిగా చెప్పింది. లేదంటే దౌత్య బంధాలు దెబ్బతింటాయని పేర్కొంది.మరోవైపు భారత్ అంతర్గత వ్యవహారంలో జర్మనీ తలదూర్చడంపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనీ రాయబారికి నోటీసులు ఇచ్చింది. వివరణ కోరింది. ఇప్పుడు అమెరికాకు అదేరీతిలో బదులిచ్చింది. మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటివల కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలోనే జైలు నుంచి ఆయన పంపిన సందేశాన్ని సీఎం సతీమణి సునీత కేజ్రీవాల్ చదివి వినిపించారు. తనను సుదీర్ఘకాలం కటకటాల వెనక ఉంచే జైలే లేదని ముఖ్యమంత్రి అన్నారు.
Discussion about this post