దేశీయంగా తయారైన తేజస్ ను సూపర్ సోనిక్ అంటే ధ్వనివేగాన్ని మించిందిగా ఆధునీకరించి Tejas Mk1A ను రూపొందించారు. ఈ అత్యాధునిక యుద్ద విమానాన్ని జూలైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 28న దీనిని పరీక్షించారు. మిగ్ 21, సు- 7 కు బదులుగా తేలికపాటి యుద్ద విమానాన్ని 1980 దశాబ్దం చివర్లో భారతీయ రక్షణరంగ శాస్త్రవేత్తలు రూపొందించారు. 90వ దశకంలో దీనికి అసామాన్యమైన గుర్తింపు రాగ, 2001 జనవరి4న టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ 1 LCAకు తేజస్ గా నామకరణం చేసి, భారత వాయుసేనకు అందించారు. దీని టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
Tejas Mk1 ను మరింత అప్ గ్రేడ్ చేసి Tejas Mk1A గా రూపొందించారు. దీంతో భారత రక్షణ రంగ అభివృద్ది చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. తేజాస్ Mk1 versionలో బుల్లెట్లను పంపే వీలుండేది కాదు. కత్తుల వంటి పదునైన ఆయుధాలను మాత్రమే విసిరే సౌకర్యం ఉండేది. ఆపై దానిని ‘The Flying Bullets’ ను వెదజల్లే విధంగా దానిని రూపాంతరం చేశారు. మొదటి తరం నుంచి ఇప్పటివరకు చూస్తే తేజాస్ ను అత్యాధునీకరించారు. ఇది 4.5 జెనరేషన్ కు చెందింది. దీనిని బహుముఖంగా ఉపయోగించవచ్చు. హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అంటే హాల్ కు Tejas Mk1A రకాన్ని అందించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ ఇచ్చింది. గతేడాది డిసెంబరులో జరిపిన ఈ డీల్ విలువ రూ. 36 వేల 468 కోట్లు. మరో 97 తేజ జెట్ యుద్ద విమానాల కోసం నావికాదళ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఆర్డర్ ఇచ్చింది. రిటైర్డ్ గ్రూపు కెఫ్టన్ కేకే వేణుగోపాల్ Tejas Mk1A ను ఈ ఏడాది మార్చి 28న విజయవంతంగా ఆకాశంలో 15 నిముషాల పాటు విజయవంతంగా నడిపారు.
LCA Tejas Mk1 గ్రూపు కెఫ్టన్ సునీత్ కృష్ణ మాట్లాడుతూ సమకాలీన సాంకేతికతతో అభివృద్ది చేసిన ఈ యుద్ద విమానాన్ని రానున్న 30 ఏళ్లలో సేవలందిస్తుందన్నారు. ఈ యుద్ద విమానం చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ నూతన ఎలక్ర్టానిక్స్, ప్రొసెస్సర్స్, డిస్ ప్లే వ్యవస్థలతో వైర్ సిస్టములతో ఎగరగలిగిన సరికొత్త హార్డువేర్ తో రూపొందించబడిందన్నారు. ఇది గాలిలో నుంచి భూమికి, గాల్లో నుంచి గాల్లోకే కాకుండా, జామర్స్ నుంచి సురక్షితంగా ప్రయాణించగలదు. దీనిలో అత్యధునిక రాడార్ వ్యవస్థ 50 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో,ఇదివరకటి తేజాస్ కంటే 40 శాతం అత్యాధునిక సాంకేతికతతో ఈ యుద్ద విమానాన్ని రూపొందించారని కెఫ్టన్ కృష్ణ చెప్పారు.
Tejas Mk1A ఆధునిక సాంకేతికత గల AESA Radar ఉంది. త్వరలో దానిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ హాల్ రూపొందించిన Uttam AESA Radar ను అమర్చనున్నారు. దీంతో 360 డిగ్రీల్లో తిరుగుతూ 200 కిమీ దూరంలోని వస్తువులను కూడా స్కాన్ చేయగలదు. ఆపై దీనిని రెండు ఇంజన్లతో డెక్ బేస్డ్ ఫైటర్ జెట్ గా Tejas Mk2 గా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. హాల్ Mk1 and Mk1A variants నిర్వహణా బాధ్యతలను చూసుకుంటుంది. దీనికన్నా పెద్దదైన మరింత శక్తివంతమైన జెట్ ను రూపొందించేందుకు రక్షణ రంగం కృషి చేస్తున్నారు. Mk1A లో రకరకాలైన ఆయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. కంటికి కనిపించన మిసైళ్లతోపాటు, గాలి నుంచి గాలిలోకి గాలి నుంచి భూమిపైకి మిస్సైళ్లను గురిపెట్టి, ఎలక్ట్రానిక్ యుద్దరంగంలో ప్రతాపం చూపగలదు.
Discussion about this post