ప్రశాంత్ నీల్ సాలార్ 2 సినిమా షూటింగ్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. మొదటి భాగం కంటే ఈ సినిమాను బాగా చూపించాలనుకుంటున్నాడు. 1లో మిగిలిపోయిన పలు ప్రశ్నలకు సాలార్ సమాధానం చెప్పబోతున్నాడు.పార్ట్ 2లో కావల్సినంత కంటెంట్ ఉండబోతోందని అర్థమవుతోంది.కానీ సాలార్ పార్ట్-1 పూర్తి చేసిన తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ లూసిఫర్-2 ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాడు. కొన్నాళ్ల క్రితం పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా లూసిఫర్-2ను ప్రకటించారు. మోహన్ లాల్ మార్చి నుంచి లూసిఫర్-2కి కాల్ షీట్స్ కేటాయించారు. అంతేకాదు తొలి షెడ్యూల్‌ని విదేశాల్లో ప్లాన్ చేశారు. సో.. ఆ సినిమా షూటింగ్ కోసం పృథ్వీరాజ్ విదేశాలకు వెళ్లబోతున్నాడట. అతను మళ్లీ అందుబాటులోకి వచ్చే వరకు సాలార్-2 ప్రారంభం కాకపోవచ్చు. సాలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం కోసం పృథ్వీరాజ్ ఎంత అవసరమో పార్ట్-1 చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ గ్యాప్‌లో ప్రభాస్ ‘రాజాసాబ్’, కల్కి చిత్రాలను పూర్తి చేయనున్నాడు.
Discussion about this post