ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 50 వేల రూపాయలకు మించి తీసుకెళ్ళే డబ్బుకు రసీదు చూపించాలని నాగార్జునసాగర్ ఎస్ఐ సంపత్ చెప్పారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Discussion about this post