కృష్ణాజిల్లా గుడివాడలోని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు . పలు హోటళ్ల లో నిబంధనలు పాటించకపోవడం…. అశుభ్ర వాతావరణాన్ని గుర్తించారు . ఏలూరు రోడ్డులో ఫ్రైడ్ వింగ్స్ ఫుడ్ కోర్ట్ ను అధికారులు సీజ్ చేశారు . గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో గల ఫ్రైడ్ వింగ్స్ హోటల్లో గత రెండు రోజుల క్రితం నిలువ ఉంచిన పదార్థాలను అమ్ముతున్నారన్న సమాచారం పై కృష్ణాజిల్లా ఫుడ్ కంట్రోలర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లు ఆకస్మిక తనిఖీ చేశారు. హోటల్లో నిలువ ఉంచిన ఆహార పదార్థా లు , గడువు తీరిన వంట సామాగ్రిని, బూజు పట్టిన బ్రెడ్ లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ కూడా లేదని గుర్తించారు . గడువు తీరిన వంట సామాగ్రిని సీజ్ చేశారు.ప్రక్కనే ఉన్న అలంకార్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో కూడా తనిఖీలు నిర్వహించి రెండవసారి వేడి చేసేందుకు సిద్ధంగా ఉంచిన తండూరి చికెన్ ముక్కలను చెత్త బుట్టలో పారవేయించి దానిపై ఫినాయిల్ చల్లారు. హోటల్లలో కాలపరిమితి తీరిన ముడి పదార్థాలు….ఫంగస్ పట్టిన బ్రెడ్లు, హానికర కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు . నిబంధనలు పాటించని హోటళ్లపై సెక్షన్ 61 ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు .
Discussion about this post