పాలమూరులో పొలిటికల్ వార్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడుస్తున్నాయో లేదో కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు, సవాళ్లు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు, నువ్వా.. నేనా..? పార్లమెంటు సెగ్మెంట్‌లో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫ్లెక్సీలు, పోస్టర్లతో ఎన్నికల హడావుడిని ఇప్పటికే రెచ్చగొట్టారు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నేత చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది.
Discussion about this post