భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మార్చి 20 నాటికి ముగుస్తాయి. బూర్గంపహాడ్, మణుగూరు, పినపాక, అశ్వాపురం మండలాల్లో 5 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 2,061 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా..అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Discussion about this post