రాబోయే లోక్ సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లేదా నిజామాబాద్ నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. మోదీ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే అంతకన్నా భాగ్యం ఏముంటుందని, ఆయన విజయం కోసం పాదయాత్ర చేస్తానని చెప్పారు. నిజామాబాద్ లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసమే కోరుట్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసానని, పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టలేదని చెప్పారు.
Discussion about this post