ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2024 కోసం అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. కొత్త కెప్టెన్లతో ఈ సీజన్లో చాలా జట్లు ప్రవేశించనున్నాయి. అయితే, కెప్టెన్‌పై మూడు జట్లు ఆందోళన చెందుతున్నాయి. వారి కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే దానిపై కూడా సందేహం ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అయోమయంలో ఉన్నాయి. ఐపీఎల్ 2024లో ఇద్దరు ఆటగాళ్లు తిరిగి కెప్టెన్‌గా మారబోతున్నారు. ఒకరు శ్రేయాస్ అయ్యర్ కాగా మరొకరు రిషబ్ పంత్. వీరిద్దరూ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్లో ఆడలేదు. ఈ లీగ్ సీజన్లో వాళ్లిద్దరూ కెప్టెన్లుగా వస్తున్నారు. ఇక్కడే ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఈ సారి వారి పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం ఇద్దరి ఫిట్నెస్. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్లో ఆడడం ఖాయం. రంజీ ట్రోఫీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో అతని పాత వెన్ను గాయం మళ్లీ బయటపడింది. ఈ కారణంగా, అతను రంజీ ట్రోఫీ ఫైనల్లో నాలుగు, ఐదవ రోజుల్లో ఫీల్డింగ్ చేయలేదు. బ్యాక్ స్కాన్ కోసం ఆసుపత్రికి కూడా వెళ్ళాడు. అంటే అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తాయి.
రిషబ్ పంత్ ఫిట్‌గా మారడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త. అతనికి కెప్టెన్సీ సైతం అప్పగించింది. అయితే, ఐపీఎల్ ఒత్తిడిని తట్టుకునేంత ఫిట్‌గా పంత్ ఉన్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. పంత్‌పై అదనపు ఒత్తిడి లేకుండా, ఫ్రాంచైజీ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చని కూడా తెలుస్తోంది. ఇది జరిగితే, పంత్ వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది మాదిరిగానే డేవిడ్ వార్నర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై కూడా ప్రశ్నలు ఉన్నాయి. గాయం కారణంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. దీని తరువాత అతను పునరావాసం కోసం NCA కి వెళ్ళాడు. అక్కడి నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. కానీ, అతని సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్‌లలో ఆడకపోతే, అతని స్థానంలో ఎవరు జట్టు బాధ్యతలు తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది. ఈ ముగ్గురు తమ జట్లకు కెప్టెన్ లుగా వ్యవహరరిస్తారా? అర్ధంతరంగా తప్పుకుంటారా అనేది చూడాలి.
Discussion about this post