IPL 2026 వాయిదా పడుతుందా.. ?

వరల్డ్ కప్‌‌‌‌ ముగిసిన వెంటనే క్రికెట్ ఫ్యాన్స్‌‌‌‌ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌కు మరో మూడు వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్‌ విడుదల కాలేదు.

ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం లీగ్‌పై గట్టిగానే పడనుంది. ఎందుకంటే దేశంలో చమురు, గ్యాస్‌ కొరతకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. ఐపీఎల్‌ ఫ్రాంచైజీల నగరాలు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో రెండు రోజులుగా గ్యాస్‌ లేక ఇబ్బందిపడుతున్నాయి. దీంతో తమ హోటళ్లను మూసివేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే లీగ్‌కు ప్రధాన అడ్డంకిగా మారనుందా అనేది చూడాలి.

అయితే ఇప్పటికే ఐపీఎల్ ను రెండు ఫేస్ లుగా విభజించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ ఫేస్ లో 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్ ను మార్చి 12 లేదా 13న విడుదల చేయనున్నారు.. మరోపక్క సెకండ్ ఫేస్ షెడ్యూల్ కు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత సెకండ్ ఫేస్ షెడ్యూల్ ను ఖరారు చేయనున్నట్లు BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

ఒకపక్క తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మరోపక్క మిడిల్ ఈస్ట్‌‌‌‌లో అమెరికా– ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోలియం, ఎల్పీజీ ఉత్పత్తుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఐపీఎల్‌‌‌‌పై ఎఫెక్ట్ చూపనుంది. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తమ వద్ద రెండు రోజులకు సరిపడే గ్యాస్ నిల్వలు ఉన్నాయని పలు స్టార్ హోటళ్లు చెబుతున్నాయి.

ఐపీఎల్‌‌‌‌ సందర్భంగా క్రికెటర్లు ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్పీజీ కొరత వల్ల లీగ్‌‌‌‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా బీసీసీఐ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ‘పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ నెల 28 నాటికి అంతా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కానీ ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, తాము ఇతర ప్రత్యామ్నాయాలను వెతకాల్సిందనని బీసీసీఐ చెప్పుకొచ్చింది.

ఎందుకంటే ఇది జట్లు, ఆటగాళ్లపైనే కాకుండా ప్రేక్షకులపైనా ప్రభావం చూపుతోంది. అందుకే ఈ విషయంపై పూర్తి నిఘా ఉంచామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇక యుద్ధం కారణంగా పలు దేశాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వరల్డ్ కప్‌‌‌‌ కోసం ఇండియా వచ్చిన సౌతాఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు ఇంకా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే ఐపీఎల్‌‌‌‌ కోసం ఫారిన్ ప్లేయర్లు ఇండియా చేరుకునే విషయంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఐపీఎల్ వాయిదా పడనుందా..?
ఇంకా మొదటి విడత షెడ్యూల్‌ విడుదల కాలేదు
మరో మూడు వారాల సమయమే ఉంది..!
పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు..
పశ్చిమాసియాలో యుద్ధం ఐపీఎల్ పై గట్టిగానే ఎఫెక్ట్
దేశంలో ఆయిల్, గ్యాస్‌ కొరత ఏర్పడే చాన్స్
చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో..
రెండు రోజులుగా గ్యాస్‌ లేక ఇబ్బందులు

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top