మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 39 రోజులు తరువాత జూన్ 28, శుక్రవారం నాడు ఇరాన్ లో అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి . ఇరానియన్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా భారతదేశంలో నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
ఇరాన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి 400 మంది అభ్యర్థులు నామినేట్ చేసుకోగా , ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 80 మంది అభ్యర్థులను ఆమోదించింది. వారిలో ఆరుగురు పోటీ చేయడానికి షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.ప్రస్తుతం నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు: ప్రస్తుత స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ , దౌత్యవేత్త సయీద్ జలీలి , మతాధికారి మోస్తఫా పూర్మొహమ్మది, మరియు చట్టసభ సభ్యుడు మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
3,000 మందికి పైగా ఇరానియన్లు భారతదేశంలో నివసిస్తున్నారు .వారికోసం ఢిల్లీ, ముంబై, పూణే మరియు హైదరాబాద్ నగరాల్లో నాలుగు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు .
ఇరాన్‌లో, అధ్యక్షుడిని ప్రజలు డైరెక్ట్ గా ఎన్నుకుంటారు, కాబట్టి మేము ఇరానియన్లందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జూన్ 29న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఇరాన్‌లో రాష్ట్రపతికి తన పదవీ కాలంలో అసహజ మరణం సంభవిస్తే 50 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. భారతదేశంలోని ఇరానియన్లు బయటకు వచ్చి ఓటు వేస్తారని మేము ఆశిస్తున్నాం అని , ఇరాన్ రాయబారి ఎలాహి అన్నారు .
ఇదిలా ఉండగా, ఇరాన్ షాంఘై సహకార సంస్థ లో కొత్తగా సభ్యత్వం పొందింది . అస్తానాలో జరగబోయే శిఖరాగ్ర సమావేశం లో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తుంది .
షాంఘై సహకార సంస్థ మరియు BRICS రెండింటిలోనూ భారతదేశం పాత్ర ముఖ్యమైనది. సమ్మిట్‌కు ఎవరిని పంపుతారో భారత్ నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం భారత్, రష్యా, చైనాలు ప్రపంచంలోనే ప్రధాన శక్తులుగా అవతరించి కొత్త అంతర్జాతీయ వ్యవస్థకు బాటలు వేస్తాయి. వివాదాలు రేగడం మరియు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో ప్రపంచం క్లిష్టమైన దశలో ఉంది, ”అని అన్నారాయన.
Discussion about this post