దృవీకరించిన ఇరాన్ ప్రభుత్వం
ఇబ్రహీం రాయిసి తో పాటు ఇరాన్ ఫారీన్ మినిస్టర్ హుస్సేన్ అబ్దుల్లా
అజర్బైజాన్ గవర్నర్ మాలిక్ రహమతి మరో నలుగురు ఉన్నత అధికారులు
అజర్బైజాన్ ప్రాంతంలోని డ్యామ్ ప్రారంభుత్చవానికి కి వెళ్లి తిరిగి వస్తున్నా సమయంలో అజర్బైజాన్ సమీపంలోని తజూలియా ప్రాంతంలో పర్వతాల మధ్య వాతావరణం అనుకూలించక పోవడంతో ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రాయిసి, ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హుస్సేన్ అబ్దుల్ నహియాన్ తో పాటు మరో నలుగురు చని పోయినట్టు ఇరాన్ అధ్యక్షుడి వ్యవహారల ఇంచార్జి ఆయతుల్లా మహమ్మద్ అలీ ఇరాన్ అధికారిక టెలివిజన్ లో తెలిపారు. నిన్న జరిగిన ఈ దుర్ఘటన సమయంలో అజర్బైజాన్ సమీపంలో కొండల పై మంచు ప్రభావం ఎక్కువ ఉండడం, వాతావరణం అనుకూలించక పోవడంతో అజర్బైజాన్ లో ఓ కార్యక్రమానికి హాజరై వస్తున్నా సమయంలో ఈ దుర్ఘటన చోట చేసుకుందని ఆయతుల్లా తెలిపారు.
దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకోవడానికి 40 కి పైగా రెస్క్యూ టీమ్ లను పంపించామని, మంచు, కొండా ప్రాంతం ఉండడంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయ్యిందని, అద్యక్షుని హెలీకాఫ్టర్లో అధ్యక్షునితో పాటు ప్రయాణం చేస్తున్న వారు సైతం చనిపోయారని ఆయతుల్లా తెలిపారు.
ప్రస్తుతం ఉప అధక్ష్యుడిగా ఉన్న మహమ్మద్ ముంజాన్ ను తాత్కాలిక అధ్యక్షునిగా నియమించి రాబోయే 50 రోజులలు అధ్యక్షఎన్నికలు నిర్వహించ వలసి ఉంటుంది. అప్పటివరకు ఆ దేశ ఉపా అధ్యక్షుడే అధ్యక్షా బాధ్యతులు నిర్వహిస్తారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలవ వాల్సి ఉంది. అజర్బైజాన్ నుండి బయలు దేరిన తరువాత అర గంట పాటు సిగ్నల్స్ అందాయి అని తదుపరి సైతం అధ్యక్షడు ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ తో పాటు ఉన్న 4 హెలికాప్టర్ ల సిబ్బందితో సిగ్నల్స్ అందుతునే ఉన్నాయని గల్ఫ్ లో అత్యధికంగా పాపులర్ ఉన్న ఒక మీడియా వెల్లడించింది, హెలికాప్టర్ ప్రమాదానికి కచ్చితమైన అసలు కారణాలు హెలీకాఫ్టర్లో అమర్చ బడే బ్లాక్ బాక్స్ దురకనంత వరకు తెలిసే అవకాశాలు లేవు.
Discussion about this post