వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా T20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. ఏకంగా 20 టీమ్స్ ఈ ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. మరి ఈసారి టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై తీవ్రస్థాయిలో ఉత్కంఠనెలకొంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలు ఒక ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీమిండియా టైటిల్ గెలుస్తుంది అనుకుంటే చివరికి ఫైనల్ లో తడబాటుకు గురై నిరాశపరిచింది.
ఇప్పుడు జరుగుతున్నటువంటి టి20 వరల్డ్ కప్ లో అయినా టీమ్ ఇండియా సత్తా చాటాలని ఫాన్స్ అందరూ కోరుకుంటున్నారు. అయితే అటు భారత జట్టు కూడా ఇదే పట్టుదలతో బరిలోకి దిగింది. టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మొదటి మ్యాచులో ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా బ్యాటింగ్ యూనిట్ కి ఒక కీలకమైన సూచన చేశాడు. గొప్పలకు పోయి అగ్రేసివ్ బ్యాటింగ్ ఆడి బోల్తా పడొద్దు అంటూ సూచించాడు. ఆచీ తూచి ఆడటం ఎంతో మంచిది అంటూ తెలిపాడు.
మొదట బ్యాటింగ్ చేస్తే 140 నుంచి 150 స్కోర్ దాటేందుకు మాత్రమే ప్రయత్నించాలని.. భారత జట్టుకు సూచించాడు. 200- 210 స్కోర్ చేయబోయి కుప్పకూలటం కన్నా.. వికెట్లను కాపాడుకుంటూ సరైన స్కోర్ చేయడం ఎంతో బెస్ట్ అంటూ ఒక సూచన చేశాడు. అక్కడ పిచ్ కండిషన్లను బట్టి చూస్తే భారీ స్కోరు చేయడం సాధ్యం కాదని.. ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. అయితే టి20 ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాయి. అయితే స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్ లు ఎక్కువగా ఉంటూ ఉండడంతో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. బ్యాట్స్‌మెన్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఇండియా జూన్ 9వ తేదీన పాకిస్తాన్ తో తలబడబోతుంది.
Discussion about this post