తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే
ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉండగా…. కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్లు బీఆర్ఎస్ కే పడ్డాయనే అంచనా ఉంది. బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీన పరిచేందుకు, తన ప్రభుత్వంపై వస్తున్న కామెంట్లకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటూ… బలమైన నాయకులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కమ్మ ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు తాజాగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Discussion about this post