విశాఖలోని చైతన్య కళాశాలలో రూపశ్రీ ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జెల వెంకటలక్ష్మీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూపశ్రీ బలవన్మరణంపై స్పందించిన ఆమె ఘటానా స్థలాన్ని పరిశీలించి, అనంతరం కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. చైతన్య కాలేజీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. నిబందనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చైతన్య పాలిటెక్నికల్ కాలేజీపై కఠిన చర్యలుతీసుకుంటామని ఆమె తెలియజేశారు.
Discussion about this post