చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువంపై సేఫ్ ల్యాండ్ ఐన విషయం తెలిసిందే. ఐతే ల్యాండ్ ఐన దగ్గర నుంచి అవి పని చేస్తూ ఎంతో డేటాని ఇస్రో కి పంపించింది. ఐతే వాటికి ఇచ్చిన టాస్కులు పూర్తి చేసాక స్లీప్ మోడ్ లోకి పంపింది ఇస్రో. సెప్టెంబర్ 22 న చంద్రుడి మీదకు మళ్ళీ సూర్యుడు వచ్చాడు. కానీ ల్యాండర్, రోవర్ మాత్రం ఇంకా నిద్ర లోంచి బయటకు రాలేదు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్ర లేవాలని యావత్ భారతీయులతో పాటు విదేశాలు కూడా ఎంతో ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే చంద్రుడి మీద మళ్ళీ చీకటి సమయం రాబోతోంది అంటే సూర్యుడు అస్తమించబోతున్నాడు. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ల్యాండర్, రోవర్ మళ్ళీ నిద్ర లేస్తాయి అనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇలాంటి టైంలో ఒక కీలక విషయం బయట పడింది.
చంద్రయాన్ 3లో ల్యాండర్ ని, రోవర్ ని చక్కగా టెస్టులు చేసి అన్నీ పక్కాగా చూసి అంతరిక్షంలోకి పంపారు కానీ ఒక పరికరాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. చంద్రుడి మీద చల్లని వాతావరణం ఉంటుంది దాన్ని తట్టుకునే ఆ ఒక పరికరాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో బాగుండేది, ఇప్పుడు మళ్ళీ అవి తిరిగి లేచి రీసెర్చ్ చేసేవనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రుడి పై గడ్డకట్టే చలిని తట్టుకోలేకనే సూర్యరశ్మి వచ్చాక కూడా ల్యాండర్, రోవర్ పనిచేయకుండా పోయాయనే అనుమానం వ్యక్తం అవుతోంది. కేవలం సూర్యకాంతి ఆధారంగానే ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి. ఆగష్టు 23 చంద్రుడి మీద సూర్యోదయం అయ్యే నాటికి విక్రమ్ ల్యాండర్‌ను అక్కడ దించింది ఇస్రో . 14 రోజుల పగలు తర్వాత అక్కడ 14 రోజులు రాత్రి ఉంటుంది. అయితే ఈ రాత్రి సమయంలో అక్కడ మైనస్ 270 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు కిందికి పడిపోతాయి. అంత గడ్డకట్టే చలిలో 2 వారాలు ఉండటంతో ల్యాండర్, రోవర్ లో ఉండే పరికరాలు దెబ్బతినే దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇప్పుడు మళ్ళీ సూర్యకాంతి వచ్చినా అవి పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చల్లదనానికి ల్యాండర్ లోని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సంకోచానికి ఎండా వేడికి వ్యాకోచానికి గురై ఆ పరికరాలు పని చేయకుండా పోతాయి. అవి తిరిగి పనిచేసే అవకాశం ఉన్నా టెక్నాలజీ ఎంత మాత్రం సహకరించదు. ఈ ల్యాండర్, రోవర్ లో రేడియోఐసోటోపిక్ హీటర్ యూనిట్స్ ని ఏర్పాటు చేస్తే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది.. దాని కారణంగా ఆ పరికరాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఈ రేడియోఐసోటోపిక్ హీటర్ యూనిట్లలో ఎక్కువగా ప్లుటోనియం-238ను ఇంధనంగా వాడుతూ ఉంటారు. ఈ ప్లుటోనియం-238 రేడియోధార్మిక క్షీణతకు గురై వేడిని, శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీన్నే ఆల్ఫా డికే అంటారు. ఇవి ఉత్పత్తి చేసే శక్తిని విద్యుత్తుగా మార్చే సాధనాన్ని రేడియో ఐసోటోపిక్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లు అంటారు. అందులోని థర్మోకపుల్ సాయంతో అది కరెంటుగా మారుతుంది. దాన్ని బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. ఈ హీటర్లు అందించే వేడితో ల్యాండర్, రోవర్ లో వేడిని నిల్వ ఉంచేలా చేసి అవి పాడు కాకుండా కాపాడతారు.
థర్మోకపుల్ అంటే ఉష్ణోగ్రతను కొలిచే పరికరం.. ఇది ఒక జంక్షన్‌ను ఏర్పరచడానికి రెండు మెటాలిక్ వైర్లను జత చేస్తారు. ఈ జంక్షన్ వేడి చేయబడినప్పుడు లేదా చల్లబడినప్పుడు, థర్మోకపుల్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఒక చిన్న వోల్టేజ్ ఉత్పత్తి అవుతుంది. ఇది కోలవొచ్చు… ఇది ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంటుంది. రేడియోధార్మిక క్షీణత ప్రక్రియ దశాబ్దాలపాటు సాగుతుంది కాబట్టి అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడిని అందిస్తుంది. కిలో ప్లుటోనియం-238తో 80 లక్షల కిలోవాట్ అవర్ల కరెంటును ప్రొడ్యూస్ చేస్తుంది. 1977లో నాసా ప్రయోగించిన వాయేజర్-1, 2 వ్యోమనౌకలు సూర్యుడు కాంతి అందుబాటులో ఉందని సౌర కుటుంబాన్ని దాటి వెళ్లిపోయాయి. అయినా అవి ఇప్పటికీ పనిచేస్తున్నాయంటే అందులో ఉన్న ఆర్టీజీలే కారణం.
2013లో చంద్రుడిపైకి చైనా పంపిన చాంగే-3 ల్యాండర్, యుతు రోవర్‌లలోనూ ఆర్టీజీలను ఉంచారు. ఇక 2018లో చందమామ అవతలి భాగంలో తొలిసారిగా చైనా దించిన చాంగే-4 ల్యాండర్, యుతు-2 రోవర్ ఆర్టీజీ సాయంతో నాలుగున్నరేళ్లుగా ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాయి. ఇటీవల చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు ముందు క్రాష్ అయిన రష్యాకు చెందిన లూనా-25 లో కూడా ఆర్టీజీ ఏర్పాటు చేసి పంపింది రష్యా. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించిన ఇస్రో ఆర్టీజీల గురించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆర్టీజీల అవసరాన్ని గుర్తించింది ఇస్రో.. దాని కోసం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో తన తరువాత ప్రయోగాలైన మంగళయాన్-2, శుక్రయాన్ వంటి వాటిలో ఆర్టీజీలను పెట్టి పంపించాలని డిసైడ్ అయ్యింది.
Discussion about this post