విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. సమష్టిగా రాణించి నాలుగో రోజే ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. టీమిండియా నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ జట్టుపై అశ్విన్ చరిత్ర సృష్టించాడు. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బౌలర్… స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ రికార్డును బ్రేక్ చేశాడు. చంద్రశేఖర్ 95 వికెట్లు తీయగా.. 96 వికెట్లతో అశ్విన్ అతడిని అధిగమించాడు. జో రూట్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ రికార్డును చేరుకున్నాడు. భగవత్ చంద్రశేఖర్ 1964 నుంచి 1979 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో 45 ఏళ్ల తర్వాత భగవత్ చంద్రశేఖర్ రికార్డును అశ్విన్ బద్దలుకొట్టాడు. టెస్టు క్రికెట్లో అశ్విన్ ఇప్పటివరకు 499 వికెట్లు తీయగా, మరొక వికెట్ తీస్తే 500 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. మొత్తంగా రెండు జట్ల పోటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ 41 ఏళ్ల బౌలర్ జేమ్స్ అండర్సన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 36 టెస్టుల్లో అండర్సన్ 144 వికెట్లు తీశాడు.
Discussion about this post