చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తూ పవన్ కళ్యాణ్ పాతాళానికి దిగజారాడని మంత్రి రోజా అన్నారు. బూత్ కమిటీలు మనకు ఉన్నాయా అంటూ కేడర్ పై మండిపడడం సిగ్గు చేటని, పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా అన్నారు. రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామని, అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించిందని తెలిపారు.
Discussion about this post