తెలంగాణలో పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమేనని అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలోని రావి చెరువును రైతులతో కలిసి పరిశీలించారు. నాలుగేళ్లుగా కాళేశ్వరం జలాలతో కళకళలాడిన రావి చెరువు ఎండిపోవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనని తెలిపారు. ప్రభుత్వ కక్షపూరిత వైఖరినే రైతుల దుస్థితికి కారణమన్నారు. పంటలు ఎండిపోతున్న జిల్లా మంత్రులకు సోయి, అవగాహన లేదన్నారు. కేసీఆర్ , బీఆర్ఎస్ పై కక్షతో రైతులకు కాంగ్రెస్ శిక్ష వేసిందన్నారు. 20 టీఎంసీలు ఎత్తిపోసినా ఒక ఎకరం కూడా ఎండిపోయేది కాదని చెప్పారు. రైతాంగానికి 2014 నాటి ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని తెలిపారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post