అందరినీ నట్టేట ముంచేసిన వ్యక్తి సైకో జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి.. ఎన్నికల ముందు ఊరూర తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని, వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. తాజాగా జరిగిన పదకొండు సర్వేల్లో 17-23 ఎంపీ స్థానాల్లో టీడీపీదే గెలుపని తేలిందన్నారు. సర్వేలన్నీ టీడీపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు.
Discussion about this post