ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపికి గెలుపన్నదే లేని నియోజకవర్గం ఇచ్చాపురం. టిడిపి ఆవిర్భావం నుండి ఇక్కడ పసుపుపార్టీదే హవా… కేవలం ఒకే ఒక్కసారి టిడిపి ఓడిపోయింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి గాలి వీచినా ఇచ్చాపురంలో మాత్రం టిడిపి గెలిచింది. ప్రస్తుతం బెదాళం అశోక్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఈసారి కూడా టిడిపి పట్టు నిలుపుకుంటుందా..? లేక వైసిపి జెండా ఎగరేస్తుందా? వాచ్ దిస్ స్టోరీ..
శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పుడిప్పుడే రాజకీయ వేడి అలుముకుంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లో పది అసెంబ్లీ నియోజక వర్గాలకు వైసిపి తమ అభ్యర్ధులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకెళ్తోంది. ఎచ్చర్ల, పాలకొండ మినహా మిగిలిన ఎనిమిది శాసనసభ నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. మిగిత రెండు స్థానాలను పొత్తులో భాగంగా ఒకటి బిజెపికి, మరొకటి జనసేనకు ఇస్తారని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికలకు నగారా మోగడంతో… ఇచ్ఛాపురంలో రాజకీయం రాజుకుంది. పట్టు నిలుపుకోవాలని టీడీపీ చూస్తుంటే.. టీడీపీ కంచుకోటను చేజిక్కుంచుకోవాలని వైసీపీ పావులు కదుపుతుంది. ఇచ్ఛాపురం నియోజికవర్గం 1952 లో ఏర్పాటైంది. ఈ సిగ్మెంట్ లో మొత్తం 2లక్షల 67వేల 108 మంది ఓటర్లు ఉన్నారు. ఒడిస్సా రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ఈ నియోజక వర్గంలో ఒక మున్సిపాల్టీ తో పాటు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలు కలిగి ఉన్నాయి.
ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు శాసన సభకు ఎన్నికలు జరిగాయి. 2004లో మినహా..1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీనే గెలుస్తూ వస్తోంది. ఆ తరువాత ఈ స్థానం కాంగ్రెస్ కు, ఇటు వైసిపికి అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానంలో ఈ సారి ఎలాగైన వైసిపి గెలవాలని పట్టుదలతో ఉంది. వైయస్ రాజశే ఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర, తో పాటు ఒదార్పు యాత్ర కూడా ఇచ్ఛాపురం లోనే ముగింపు పలికారు. ఇన్ని చేసినా ఆ స్థానం వైసిపి కైవసం చేసుకోలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసిపి గాలి విచిన ఇచ్ఛా పురంలో మాత్రం టిడిపి జెండా ఎగిరింది. ఆ ఎన్నికల్లో వైసిపి నుండి పోటీ చేసిన పిరియా సాయిరాజ్ పై అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే బెందాలం అశోక్ విజయం సాధించారు. 2014 లో సైతం టిడిపి తరుపున పోటీ చేసిన అశోక్ బాబు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో కూడా మరో మారు విజయం సాధించి హ్యాట్రిక్ సాధిద్ధామనే లక్ష్యంతో అశోక్ ఉన్నారు. అయితే ఈ కొత్త అభ్యర్ధిని బరిలో పెట్టింది. పిరియా విజయను అభ్యర్థిగా ప్రకటించింది. విజయ ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు.
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి పార్టీ అన్ని పదవులు కైవసం చేసుకుంది. దీనికితోడు రెండు రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మెన్ పదవులు, జిల్లా స్థాయి పదవి, జడ్పీ చైర్ పర్సన్ పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా ఈ నియోజక వర్గానికి చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే…వైసీపీ బాగా బలపడింది. కానీ వైసీపీ అభ్యర్ధిని ఆ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్‌తో పాటు భర్త పిరియా సాయిరాజ్ క్యాడర్ని కలుపుకువెళ్లడం లేదనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. టిడిపి అభ్యర్థి అశోక్ మాత్రం ఎంపీ రామ్మోహన్నాయుడు, జనసేన, బిజెపితో కలసి నియోజక వర్గం విసృ తంగా పర్యటనలు చేస్తున్నారు. మొత్తంగా ఇచ్ఛాపురంలో ఉనికి కోసం ఒకరు పొరాడుతుంటే.. మరోకరు హ్యట్రిక్ కొట్టేందుకు వ్యూహ రచన చేస్తుతున్నారు. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలి అంటే..ఎన్నికల వరకు ఆగాల్సిందే..!
Discussion about this post