టీడీపీ,జనసేన, బీజేపీ,పార్టీలకు అడుగడుగునా ప్రజల నుండి మద్దతు లభిస్తోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు.అప్పు చేసి జీతాలు ఇచ్చుకునే స్థితికి వైసీపీ సర్కార్ దిగజారిందన్నారు. ఒకే ఒక్క అవకాశం అని చెప్పిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పదేళ్ళు వెనక్కి తీసుకువెళ్లారన్నారు.వైసీపీ లో ఉన్నన్ని రోజులు ప్రజలకు ఏమి చేయలేని స్థితిలో పార్టీని వీడాల్సివచ్చిందన్నారు.తను పుట్టి పెరిగింది సౌత్ నియోజవర్గంలోనే అంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.
Discussion about this post