మెదర మెట్లలో జరిగిన వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ అబద్ధాల విషం వెదజల్లారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 50 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించిన వైసీపీ నేతలు.. ఏర్పాట్లు సరిగా చేయకపోవటంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను నెరవేర్చామని జగన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెగా డీఎస్సీ తీస్తామని చెప్పి దగా చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు.
Discussion about this post