సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఉదయం గంటావారిపాలెం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అయింది. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Discussion about this post