జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయ సమీపంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. స్త్రీలపై ఏదైనా అఘాయిత్యం జరిగితే టెస్టులు జరిపడానికి, నేర నిరూపణ చెయ్యడానికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భరోసా కేంద్రాల్లో కౌన్సిలర్, న్యాయవాదులతో పాటు జడ్జిలు కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Discussion about this post