రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని పార్టీలలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేరాడని, ఇక మిగిలింది ఒక్క ఎంఐఎం పార్టీ మాత్రమే అని బీజేపి క్రమశిక్షణ కమిటీ సభ్యుడు నాగురావు నామోజీ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక సముద్రం లాంటిదని, పోయే నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందని చెప్పారు. పార్టీని నమ్మి వచ్చే వాళ్లను అక్కున చేర్చుకుంటుందని, స్థిరత్వం లేని చంచల గుణమున్న వ్యక్తులు పార్టీని విడిచి వెళుతుంటే వద్దనేది లేదన్నారు.
Discussion about this post