మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టులో పేరుకున్న పూడిక తొలగింపు, ఇతర సమస్యల పరిష్కారానికి సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు పాదయాత్రను ఆయన మండల పరిధిలోని బొప్పారంలో ప్రారంభించారు. మూసీ ప్రాజెక్టు సమీపంలోని బొప్పారంలో 50 మందితో ప్రారంభమైన పాదయాత్ర 20కిలోమీటర్లు కొనసాగి కేతేపల్లిలో ముగిసింది.






















Discussion about this post