వాలంటీర్లను పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు. వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేశాడని, కాని చేయించింది మాత్రం చంద్రబాబు నాయుడు అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించడమే టీడీపి లక్ష్యమని చెప్పారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉంటేనే ప్రజలకు, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
Discussion about this post