విశాఖలోని లక్షలాది ఇళ్లకు కరెంటు సరఫరాను నిలిపివేయడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విద్యుత్ ఇంజనీర్లపై ఫైర్ అయ్యారు. సీఎం జగన్ పర్యటన కోసం విద్యుత్ పనులు చేస్తున్నామని అందువల్ల సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని ఇంజనీర్లు తెలిపారు. దీంతో ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు పాల్ ఫిర్యాదు చేశారు. మనం ఏమన్నా.. ఆఫ్ఘనీస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో లాగా నియంతృత్వంలో ఉన్నామా అని ఆయన ప్రశ్నించారు. నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో పాల్ రావాలి.. పాలన మారాలి అని యువకులు నినాదాలు చేశారు. విశాఖ ఎంపీగా ఆయనను గెలిపించాలని పాల్ కోరారు.
Discussion about this post