తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాలుగు సార్లు కలిసి మాట్లాడానని కేఏపాల్ అన్నారు. ప్రపంచ శాంతి సమ్మిట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతి తెలిపారని ఆయన అన్నారు. 6 నెలలు కాలం కావస్తున్నా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రపంచ దేశాల నేతలు, బిలినియర్స్ ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు ధ్యానంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. సమ్మిట్ జరిగితే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేఏ పాల్ తెలిపారు.
Discussion about this post