కల్వకుర్తి పట్టణానికి చెందిన మ్యాకల అమరావతి-మల్లికార్జున కుమార్తె అనుష చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉండే బాలిక. గత 15 రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన విద్య వైద్యం నీటు ఫలితాలలో 720 మార్కులకు గాను 526 మార్కులు, అదేవిధంగా ఎంసెట్ లోను సైతం 2025 ర్యాంకు సాధించి తన సత్తా చాటింది. కౌన్సెలింగ్కు అవసరమైన బోనఫైడ్స్ అవసరమై తాను చదువుకున్న కల్వకుర్తి పట్టణంలోని వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్ కు ఆమె తండ్రి వెళ్లారు .. పాఠశాల యజమాన్యం బోనఫైడ్స్ ఇవ్వటానికి షరతు పెట్టారు , పాత బాకీ ఉందని అది చెల్లిస్తేనే బోనఫైడ్స్ ఇస్తామన్నారు . విధి లేని పరిస్థితుల్లో డబ్బుచెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారు .ఈ స్కూల్ యాజమాన్య వైఖరిని అందరు నిరసిస్తున్నారు .
Discussion about this post